Visakhapatnam District: నర్సీపట్నం మార్చురీలోనే మావోయిస్టుల మృతదేహాలు... తీసుకెళ్లడానికి రాని కుటుంబ సభ్యులు

  • ఈ నెల 22, 23 తేదీల్లో ఏజెన్సీలో ఎన్ కౌంటర్  
  • ఐదుగురు మావోయిస్టులు మృతి  
  • మృతదేహాలను తమకు అప్పగించాలన్న పౌరహక్కుల సంఘం
  • రక్తసంబంధీకులు, స్నేహితులకు మాత్రమే అప్పగిస్తామంటున్న పోలీసులు

విశాఖ మన్యం ఏరియాలో ఎన్ కౌంటర్ లో మృతిచెందిన మావోయిస్టుల మృతదేహాలు ఇప్పటికీ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఉన్నాయి. ఈ నెల 22, 23వ తేదీల్లో జరిగిన ఎదురుకాల్పుల ఘటనల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. అప్పటినుంచి వారి మృతదేహాలను నర్సీపట్నం మార్చురీలోనే భద్రపరిచారు. మృతదేహాలను తీసుకునేందుకు వారి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఆ మృతదేహాలను తమకు అప్పగించాలని పౌరహక్కుల సంఘం నేతలు కోరుతున్నారు. పోలీసులు మాత్రం రక్తసంబంధీకులు, స్నేహితులకు మాత్రమే అప్పగిస్తామని స్పష్టం చేశారు. చనిపోయిన మావోయిస్టులను చత్తీస్ గఢ్ కు చెందినవారిగా గుర్తించారు.

More Telugu News