Telugudesam: హుజూర్ నగర్ లో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయం... అభ్యర్థిని రేపు ప్రకటించనున్న చంద్రబాబు

  • హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక
  • అక్టోబరు 21న పోలింగ్
  • టీటీడీపీ నేతలతో సమావేశమైన చంద్రబాబు

తెలంగాణ రాజకీయాలన్నీ ఇప్పుడు హుజూర్ నగర్ ఉపఎన్నిక చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన అనంతరం నల్గొండ ఎంపీ స్థానం నుంచి కూడా విజయం సాధించారు. దాంతో ఆయన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని వదులుకోవడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నిక అక్టోబరు 21న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను బరిలో దింపుతుండగా,ఇప్పుడు తెలంగాణ టీడీపీ కూడా సై అంటోంది. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు.

ఇవాళ తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన ఆయన పార్టీ అభ్యర్థిని రేపు ప్రకటించనున్నారు. ఈ మేరకు టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబుతో చర్చించిన పిదప హుజూర్ నగర్ బరి నుంచి పోటీచేయాలని ఇతర నేతలందరూ నిర్ణయించారని, అభ్యర్థి ఎవరన్నది రేపు ప్రకటిస్తారని, సోమవారం నామినేషన్ దాఖలు చేస్తామని వెల్లడించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో టీడీపీ బలంగా ఉందని అన్నారు.

More Telugu News