Malladi Vishnu: కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ విధానాలను గమనించి మాట్లాడాలి: మల్లాది విష్ణు

  • పూర్తిస్థాయిలో సామాజిక న్యాయం చేస్తున్నామని వెల్లడి
  • వైసీపీ పాలనలో 4 నెలల్లో 2 నెలలు వర్షాలు కురిశాయని వ్యాఖ్యలు
  • గత ప్రభుత్వంపై ఎందుకు విమర్శలు చేయరంటూ ప్రశ్నించిన మల్లాది
వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలకు దిగారు. వైసీపీ విధానాలను కన్నా గమనించి మాట్లాడాలని హితవు పలికారు. పూర్తిస్థాయిలో సామాజిక న్యాయం చేస్తున్నామని కన్నా గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో పారదర్శకమైన ఇసుక విధానం తీసుకువచ్చామని, తాము అధికారంలోకి వచ్చిన 4 నెలల్లో 2 నెలల పాటు వర్షాలు కురిశాయని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వం చేసిన అన్యాయాల గురించి కన్నా ఎందుకు మాట్లాడరు? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమ భవనంలో ఉన్నా కన్నా నోరువిప్పలేదని మండిపడ్డారు. వైసీపీని, ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీ చేస్తున్న విమర్శలకు జిరాక్స్ కాపీలా బీజేపీ విమర్శలు చేస్తోందని విష్ణు వ్యాఖ్యానించారు. వైసీపీ సర్కారుపై బురద చల్లేందుకే గవర్నర్ కు ఫిర్యాదు చేశారని అన్నారు.
Malladi Vishnu
YSRCP
Kanna
BJP
Chandrababu

More Telugu News