Savitri: సావిత్రి కోసం అనుకున్న వేషం అలా నాకు వచ్చింది: సీనియర్ హీరోయిన్ జమున

  • భానుమతిగారు షూటింగుకి లేట్ గా వచ్చారు
  • చక్రపాణిగారికి కోపం వచ్చేసింది 
  • చెల్లెలి పాత్ర తనకి దక్కిందన్న జమున 

తెలుగు తెరను ఏలేసిన కథానాయికలలో సావిత్రి తరువాత చెప్పుకునే పేరు జమున. అలనాటి అగ్రకథానాయకుల సరసన ఆణిముత్యాల్లాంటి పాత్రలను పోషించి మెప్పించిన ఆమె, తాజా ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు. "అప్పట్లో దర్శక నిర్మాతలు .. నటీనటులందరూ ఎంతో క్రమశిక్షణతో ఉండేవారు. ఒకరంటే ఒకరికి గౌరవ మర్యాదలు ఉండేవి. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనల వంటివి జరగకపోలేదు.

'మిస్సమ్మ' సినిమాలో కథానాయికగా ముందుగా భానుమతిగారినీ, ఆమె చెల్లెలి పాత్ర కోసం సావిత్రిని అనుకున్నారు. వారం .. పది రోజుల పాటు షూటింగ్ కూడా జరిగింది. అయితే శ్రావణ శుక్రవారం పూజ చేసుకుని భానుమతి గారు షూటింగుకి ఆలస్యంగా వచ్చారు. భానుమతిగారు ముందుగానే చెప్పినా, నిర్మాతల్లో ఒకరైన చక్రపాణిగారికి కోపం వచ్చింది. దాంతో ఆయన 'ఇట్లా అయితే ఎట్లా .. నువ్వు వద్దులే పో' అన్నారు. 'నువ్వూ వద్దులే పో' అంటూ మేకప్ తీసేసి ఆమె వెళ్లిపోయారు. దాంతో భానుమతి స్థానంలో సావిత్రిని తీసుకున్నారు. సావిత్రి కోసం అనుకున్న చెల్లెలి పాత్రకిగాను నన్ను ఎంపిక చేసుకున్నారు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News