Sudheer: 'సాఫ్ట్ వేర్ సుధీర్' నుంచి టీజర్ రిలీజ్

  • 'జబర్దస్త్'తో సుడిగాలి సుధీర్ కి క్రేజ్ 
  • సుధీర్ జోడీగా ధన్యా బాలకృష్ణ 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్, ఆ తరువాత టీవీ ఛానల్స్ లోని ఇతర షోలతో బిజీ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే సినిమాల్లో వస్తోన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నాడు. అలా తొలిసారిగా హీరోగానూ ఒక అవకాశాన్ని సంపాదించుకున్నాడు.

శేఖర్ రాజు నిర్మాణంలో .. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన 'సాఫ్ట్ వేర్ సుధీర్' అనే సినిమా చేశాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. లవ్ .. యాక్షన్ .. కామెడీ సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ యూత్ ను ఆకట్టుకునేలా వుంది. ఈ సినిమాలో సుధీర్ జోడీగా ధన్యా బాలకృష్ణ నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో హీరోగా సుధీర్ బిజీ అవుతాడేమో చూడాలి మరి.

More Telugu News