Andhra Pradesh: మావోయిస్టు భవానీ గాయాలతో పట్టుబడింది: డీజీపీ గౌతమ్ సవాంగ్

  • విశాఖ మన్యం ఏరియాలో కాల్పుల మోత
  • మీడియాతో మాట్లాడిన ఏపీ డీజీపీ
  • భవానీ మావోయిస్టు అగ్రనేత జగన్ భార్య అని వెల్లడి
విశాఖ మన్యం ఏరియా గత కొన్నిరోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. రెండ్రోజుల వ్యవధిలో పోలీసుల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. తాజాగా, మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ పోలీసుల అదుపులో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు. గాలికొండ-గుత్తేడు అటవీప్రాంతంలో మావోయిస్టు భవానీ గాయాలతో పట్టుబడిందని తెలిపారు. భవానీ పెదబయలు ఏరియా కమిటీ మెంబర్ అని, ఆమె మావోయిస్టు రాష్ట్ర జోన్ కమిటీ మెంబర్ జగన్ భార్య అని వివరించారు. భవానీని కోర్టులో హాజరుపర్చి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు డీజీపీ తెలిపారు. 
Andhra Pradesh
DGP
Police

More Telugu News