Kanna: ఇసుక బ్లాక్ లో దొరుకుతుంది తప్ప సామాన్యులకు అందట్లేదు: కన్నా లక్ష్మీనారాయణ

  • సీఎం తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు ఉంది
  • ఇసుక కొరత కారణంగా కూలీలు ఉపాధి కోల్పోయారు
  • గవర్నర్ హరిచందన్ ను కలిసిన బీజేపీ నేతలు

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,ఆ పార్టీ నేతలు ఈరోజు కలిశారు. అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై వినతిపత్రం ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా కూలీలు తమ ఉపాధి కోల్పోయారని, లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారని, ఇంత జరుగుతున్నా సీఎం జగన్ స్పందించడం లేదన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చినట్టు చెప్పారు.

 జగన్ మాటలకు, చేతలకు పొంతన లేదని, ఇసుకను బ్లాక్ లో విక్రయిస్తున్నారని, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడం లేదని, ఆలయ భూములను సొంత భూముల్లా తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, సీఎం తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు ఉందని ధ్వజమెత్తారు.

More Telugu News