Sudigali Sudheer: వెంకీ చేతుల మీదుగా '3 మంకీస్' టీజర్ రిలీజ్

  • కామెడీ ప్రధానంగా సాగే '3 మంకీస్'
  • బ్యాచిలర్స్ చుట్టూ తిరిగే కథ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా సుడిగాలి సుధీర్ .. గెటప్ శ్రీను .. ఆటో రామ్ ప్రసాద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోను అవకాశాలు సంపాదించుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారులుగా '3 మంకీస్' చిత్రం రూపొందుతోంది. నాగేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి వెంకటేశ్ చేతుల మీదుగా ఒక టీజర్ ను రిలీజ్ చేయించారు. ఈ సినిమాలో ఈ ముగ్గురూ స్నేహితులుగా కనిపించనున్నారనే విషయం ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. మందు పార్టీలు చేసుకునే బ్యాచిలర్స్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా సాగనుంది. షకలక శంకర్ ఓ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఈ ముగ్గురిని ఎంతవరకూ బిజీ చేస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News