HCA: ‘క్రికెట్’కు ప్రభుత్వ సహకారం కావాలని కేటీఆర్ ను కోరాను: హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్

  • కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశా 
  • సీఎం కేసీఆర్ ను కూడా కలుస్తా
  • పార్టీలకు అతీతంగా అందరి సహకారం కోరతా
క్రికెట్ క్రీడకు ప్రభుత్వ సహకారం అందించాలని మంత్రి కేటీఆర్ ను కోరానని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్ అన్నారు. బుద్ధభవన్ లో కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు చెప్పారు. క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సీఎం కేసీఆర్ ను కూడా కలుస్తానని చెప్పారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలిసి సహకారం కోరతానని అన్నారు. కాగా, టీఆర్ఎస్ ప్రత్యర్థి వివేక్ వెంటస్వామి ప్యానెల్ హెచ్సీఏ ఎన్నికల బరిలో నిలవడంతో అజారుద్దీన్ కు టీఆర్ఎస్ మద్దతుగా నిలవడంతో ఆయన సునాయాసంగా గెలిచారు. ఈ ఎన్నికల్లో తనకు మద్దతు ఇస్తే గెలిచాక టీఆర్ఎస్ లో చేరతానని అజారుద్దీన్ ముందుగా హామీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ లో అజారుద్దీన్ చేరతారన్న ప్రచారం జరుగుతోంది.
HCA
President
Azaharudding
Minister
KTR

More Telugu News