Chandrababu: ఐదేళ్లలో ఒక్క నిరుద్యోగికి అయినా చంద్రబాబు అండగా ఉన్నారా?: ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి

  • చంద్రబాబు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా?
  • టీడీపీ హయాంలో కోట్ల రూపాయల ఇసుక దోపిడీ
  • జగన్ కు మంచి పేరు వస్తోందనే బాబు విమర్శలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి విమర్శలు గుప్పించారు. విజయనగరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బాబు వస్తే జాబ్ వస్తుందన్న చంద్రబాబు ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? గత ఐదేళ్లలో ఒక్క నిరుద్యోగికి అయినా చంద్రబాబు అండగా ఉన్నారా? అని ప్రశ్నించారు. అలాంటి చంద్రబాబుకు, సీఎం జగన్ ని విమర్శించే అర్హత లేదని అన్నారు.

జగన్ కు మంచిపేరు రావడం వల్లే బాబు విమర్శిస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు కోట్ల రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడ్డారని, గత పాలకుల కారణంగానే ఇప్పుడు ఇసుక కొరత ఏర్పడిందని ఆరోపించారు. నందమూరి హరికృష్ణ, కోడెల శివప్రసాద్ మరణాలను తన నీచ రాజకీయాలకు చంద్రబాబు వాడుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Chandrababu
Telugudesam
YSRCP
Kolagatla

More Telugu News