Ravibabu: ఉత్కంఠను రేపుతోన్న 'ఆవిరి' టీజర్

  • రవిబాబు నుంచి మరో హారర్ థ్రిల్లర్ 
  • ఆత్మల నేపథ్యంలో నడిచే కథ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు 

మొదటి నుంచి కూడా రవిబాబు హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఎక్కువగా తెరకెక్కిస్తూ వస్తున్నాడు. ఈ తరహా సినిమాల ద్వారా ఆయనకి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ చిత్రాలను అందించే దర్శకుడిగా కూడా ఆయన మార్కులు కొట్టేశాడు. అలాంటి రవిబాబు తాజా చిత్రంగా 'ఆవిరి' రూపొందుతోంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. ఓ ఇంట్లో ఆత్మలు తిరుగాడే దృశ్యాలను .. అవి చేసే పనులను ఆయన చాలా డిఫరెంట్ గా చూపించాడు. 'ఆవిరి' పట్టిన అద్దంపై 'ఆవిరి' అనే ఆంగ్ల అక్షరాలను రాస్తూ .. ఓ చిన్నపిల్ల ఫేస్ ను రివీల్ చేస్తూ ఆయన ఈ సినిమాపై ఆసక్తిని పెంచాడు. నేహా చౌహాన్ ప్రధాన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'ఆవిరి' ద్వారా తన ఉనికిని చాటుకునే ఈ ఆత్మల కథ ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెడుతుందో చూడాలి మరి.

More Telugu News