Bhutan: భూటాన్ కొండల్లో కూలిపోయిన భారత ఆర్మీ హెలికాప్టర్

  • ఇద్దరు మృతి
  • ప్రాణాలు కోల్పోయిన భారత లెఫ్టినెంట్ కల్నల్, భూటాన్ ఆర్మీ పైలెట్
  • ఖెంటంగ్మనీ పర్వతాల్లో శకలాలు

భారత ఆర్మీ శిక్షణ విభాగానికి చెందని ఓ హెలికాప్టర్ భూటాన్ భూభాగంపై కూలిపోయింది. ఈ చీతా హెలికాప్టర్ కాసేపట్లో గమ్యస్థానం చేరుతుందన్న వేళ భూటాన్ లోని ఖెంటంగ్మనీ పర్వతాల్లో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో భారత్ కు చెందిన ఓ లెఫ్టినెంట్ కల్నల్, భూటాన్ ఆర్మీ పైలెట్ ప్రాణాలు కోల్పోయారు. భూటాన్ కు చెందిన సైనికులు, పైలెట్లు భారత దళాలతో కలిసి శిక్షణ పొందడం ఎప్పటినుంచో జరుగుతోంది.

ఈ క్రమంలో సైనిక హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్ లోని ఖిర్ము ప్రాంతం నుంచి భూటాన్ లోని యాంగ్ ఫుల్లా ఎయిర్ స్ట్రిప్ కు బయల్దేరింది. కొద్దిసేపటికే గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోవడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఖెంటంగ్మనీ పర్వతాల్లో హెలికాప్టర్ శకలాలు కనిపించడంతో, ప్రమాదవశాత్తు కూలిపోయి ఉంటుందని అంచనా వేశారు.

More Telugu News