Telugudesam: ఇసుక కొరతపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు?: యరపతినేని శ్రీనివాసరావు

  • టీడీపీ హయాంలో ఇసుక కొరత లేదు.. వలసలు లేవు
  • నాడు ఇసుక యూనిట్ ధర రూ.300
  • వైసీపీ ప్రభుత్వ హయాంలో దాని ధర రూ.3000?

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక సరఫరా చక్కగా జరిగిందని ఆ పార్టీ నేత యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తమ హయాంలో ఇసుక కొరత లేదని, ఎవరూ వలస పోలేదని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం రాగానే ఇసుక కొరత ఎందుకు ఏర్పడింది? టీడీపీ హయాంలో ఇసుక యూనిట్ ధర రూ.300 ఉంటే, ఇప్పుడు రూ.3000 కు ఎందుకు పెరిగింది? అది కూడా బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నారని ఆరోపించారు. దాదాపు ఇరవై లక్షల కుటుంబాలు వలస పోయే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇసుక కొరత ప్రభావం వ్యాపారవర్గాలపై పడిందని విమర్శించారు. భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతి రంగంపైనా ఇసుక కొరత ప్రభావం పడిందని, దీనిపై వైసీపీ ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

More Telugu News