శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్
- స్వయంగా కలిసి ఆహ్వానపత్రిక అందించిన సుబ్బారెడ్డి
- ఈనెల 29 నుంచి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
- టీటీడీలో సంస్కరణలపై రాజ్‌నాథ్ అభినందన
ఈనెల 29వ తేదీ రాత్రి ఏడు గంటలకు అంకురార్పణ ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ తిరుమలలో టీటీడీ చేపడుతున్న సంస్కరణలను రక్షణ మంత్రి కొనియాడారని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో ప్రజల కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారన్నారు.