Ayyanna Patrudu: కులమత విద్వేషాలు రెచ్చగొట్టారని మాజీ మంత్రి అయ్యన్నపై కేసు

  • సీఎం జగన్‌ను ఉద్దేశిస్తూ తూలనాడారని ఆరోపణ
  • వైసీపీ నేత వెంకట్రావు ఫిర్యాదు
  • 153 ఎ, 500, 506 సెక్షన్ల కింద కేసు
విశాఖ జిల్లాలో సీనియర్‌ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను ఉద్దేశించి విమర్శలు చేస్తున్న సందర్భంగా ఆయన కుల, మత, ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు వెంకట్రావు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

రెండు రోజుల క్రితం అయ్యన్నపాత్రుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు, ఇటీవల జరిగిన పరిణామాలు, రాష్ట్రంలో పరిస్థితులపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విమర్శల్లో విద్వేషాలు రెచ్చగొట్టే మాటలు ఉన్నాయంటూ పోలీసులు ఆయనపై ఐపీసీలోని 153ఏ, 500, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం గమనార్హం.
Ayyanna Patrudu
police case
jagan
communal speech

More Telugu News