yusuf pathan: వేణుమాధవ్ మృతితో టీమిండియా క్రికెటర్ యూసుఫ్ పఠాన్ షాక్

  • వేణుమాధవ్ మృతితో షాకయ్యానంటూ పఠాన్ ట్వీట్
  • ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
  • ఆయన మీకెలా తెలుసంటూ అభిమానుల షాక్
టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై టీమిండియా క్రికెటర్ యూసుఫ్ పఠాన్ స్పందించాడు. వేణుమాధవ్ మరణవార్త చూసి షాకైనట్టు తెలిపాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. వెండితెరపై తాను చూసిన మంచి హాస్యనటుల్లో వేణుమాధవ్ ఒకరని పేర్కొన్నాడు. తెలుగు చిత్రసీమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని అన్నాడు.  వేణుమాధవ్ కుటుంబ సభ్యులు, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నాడు.

తెలుగు కమెడియన్ అయిన వేణుమాధవ్ మృతిపై యూసుఫ్ పఠాన్ ట్వీట్ చేయడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. వేణుమాధవ్ గురించి మీకెలా తెలుసంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే, వేణుమాధవ్‌తో యూసుఫ్ పఠాన్‌కు  ఎలా పరిచయం అయిందన్న విషయం మాత్రం తెలియరాలేదు.  
yusuf pathan
team india
venumadhav
Tollywood

More Telugu News