Kota Srinivasarao: బాకీ తీర్చడానికి చాలా ప్రయత్నించా, కానీ వద్దనే వాడు!: వేణుమాధవ్ గురించి చెప్పిన కోట

  • వేణుమాధవ్ మృతితో శోకసంద్రంలో టాలీవుడ్ కమెడియన్లు
  • విషాదంలో మునిగిపోయిన కోట
  • చిన్నవయసులోనే కన్నుమూయడం బాధాకరమని వ్యాఖ్యలు
వేణుమాధవ్ మృతితో తెలుగు కామెడీ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. సీనియర్ కమెడియన్ల నుంచి అప్ కమింగ్ హాస్యనటుల వరకు ప్రతి ఒక్కరూ వేణుమాధవ్ తో తమ అనుబంధం గుర్తుతెచ్చుకుని విషాదభరితులవుతున్నారు.

తాజాగా, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు స్పందిస్తూ, వేణుమాధవ్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. ఓసారి విమానాశ్రయంలో షాపింగ్ చేయడానికి రూ.2,000 తగ్గాయని, అక్కడే ఉన్న వేణుమాధవ్ ని అడిగితే తీసుకో బాబాయ్ అంటూ వెంటనే ఇచ్చాడని వెల్లడించారు.

అయితే, ఆ తర్వాత ఆ అప్పు తీర్చేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా వేణుమాధవ్ వద్దనేవాడని, ఓ నట దిగ్గజం తనకు అప్పు ఉన్నాడని చెప్పుకుంటాననేవాడని గుర్తుచేసుకుని భావోద్వేగాలకు లోనయ్యారు. చిన్నవయసులోనే వేణుమాధవ్ చనిపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
Kota Srinivasarao
Venumadhav
Tollywood

More Telugu News