బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఒలింపిక్ పతక విజేత
- బీజేపీలో పెరుగుతున్న క్రీడాకారుల సంఖ్య
- హర్యానా బీజేపీ చీఫ్ భరాలా సమక్షంలో పార్టీలో చేరిన యోగేశ్వర్
- మోదీ విధానాలతో ఆకర్షితుడ్నయ్యానని వెల్లడి
తాజాగా, హర్యానా బీజేపీ చీఫ్ సుభాష్ భరాలా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధాంతాలు ఆకట్టుకున్నాయని, అందుకే బీజేపీలో చేరుతున్నట్టు యోగేశ్వర్ తెలిపాడు. మోదీ కారణంగా ప్రజాసేవ వైపు ఆకర్షితుడ్నయ్యానని, చాలాకాలంగా ఆయన్ను ఫాలో అవుతున్నానని వివరించాడు. కమలదళంలో భాగంగా కావడం పట్ల సంతోషంగా ఉందని అన్నాడు. కాగా, భారత హాకీ మాజీ కెప్టెన్ సందీప్ సింగ్ కూడా బీజేపీలో చేరాడు.