Mohanbabu: ఒక మంచి నటుడ్ని కోల్పోయాం: మోహన్ బాబు

  • అనారోగ్యంతో కన్నుమూసిన వేణుమాధవ్
  • వేణుమాధవ్ మృతిపై స్పందించిన మోహన్ బాబు
  • చిత్రపరిశ్రమకు లోటు అంటూ ట్వీట్
టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ మృతిపై సీనియర్ నటుడు మోహన్ బాబు స్పందించారు. వేణుమాధవ్ మంచి హాస్యనటుడు అని, తనతోనూ, తన పిల్లలతోనూ నటించాడని ట్వీట్ చేశారు.  ఓ మంచి నటుడ్ని కోల్పోయామని, వేణుమాధవ్ అకాలమరణం చిత్ర పరిశ్రమకు లోటు అని వ్యాఖ్యానించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబానికి మనశ్శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ లో తెలిపారు. కొంతకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న వేణుమాధవ్, కిడ్నీ సమస్యలు కూడా తలెత్తడంతో కోలుకోలేకపోయారు. తీవ్రఅస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Mohanbabu
Venumadhav
Tollywood

More Telugu News