Venu Madhav: కాసేపట్లో ఫిలిం ఛాంబర్ కు వేణుమాధవ్ భౌతికకాయం.. బన్సీలాల్ పేటలో అంత్యక్రియలు

  • నిన్న తుదిశ్వాస విడిచిన వేణుమాధవ్
  • శోకసంద్రంలో తెలుగు సినీ పరిశ్రమ
  • అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ కు వేణు పార్థివదేహం
ప్రముఖ సినీ హాస్య నటుడు వేణుమాధవ్ నిన్న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాసేపట్లో ఆయన పార్థివదేహాన్ని హైదరాబాదులోని మౌలాలీలోని నివాసం నుంచి ఫిలిం ఛాంబర్ కు తరలించనున్నారు.

 అభిమానుల సందర్శనార్థం ఫిలిం ఛాంబర్ లో వేణు భౌతికకాయాన్ని ఉంచుతామని 'మా' అసోసియేషన్ తెలిపింది. అనంతరం వేణు పార్థివదేహాన్ని బన్సీలాల్ పేటకు తరలిస్తారు. అక్కడి శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కోదాడకు చెందిన వేణుకు భార్య శ్రీవాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Venu Madhav
Tollywood
Funerals

More Telugu News