Naveen Vijaya krishna: విడుదలకి ముస్తాబవుతోన్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథా కథనాలు 
  • కీలకమైన పాత్రల్లో జయసుధ - కోట 
  • వచ్చేనెల 5వ తేదీన విడుదల  

సీనియర్ నరేశ్ తనయుడు నవీన్ విజయకృష్ణ కథానాయకుడిగా కొంతకాలం క్రితం 'నందిని నర్సింగ్ హోమ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కారణాలేవైనా ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తరువాత మంచి కథ కోసం వెయిట్ చేస్తూ వచ్చిన నవీన్ విజయ్ కృష్ణ, తదుపరి చిత్రంగా 'ఊరంతా అనుకుంటున్నారు' చేశాడు.

బాలాజీ సనాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బంధాలు - అనుబంధాల గొప్పతనాన్ని చాటుతూ, గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో మరో కథానాయకుడిగా అవసరాల శ్రీనివాస్ నటించాడు. కథానాయికలుగా మేఘా చౌదరి - సోఫియా కనిపించనున్నారు. జయసుధ .. కోట శ్రీనివాసరావు .. రావు రమేశ్ కీలకమైన పాత్రలను పోషించారు. వచ్చేనెల 5వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాతో నవీన్ విజయకృష్ణకి హిట్ పడుతుందేమో చూడాలి.

More Telugu News