Narendra Modi: మోదీ, అజిత్ ధోవల్ లను టార్గెట్ చేసిన జైషే మొహమ్మద్.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక

  • ఆర్టికల్ 370 రద్దుతో రగిలిపోతున్న ఉగ్రవాదులు
  • భారీ దాడికి స్కెచ్ వేస్తున్న జైషే మొహమ్మద్
  • సహకారం అందిస్తున్న ఐఎస్ఐ
జమ్మూకశ్మీర్ లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ ప్రాంతంలో భారీ ఎత్తున భద్రతాబలగాలను మోహరింపజేయడం వంటి చర్యలతో పాకిస్థాన్, ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భారత్ పై ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకునేందుకు యత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, భారతీయ ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ సహకారంతో జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ భారీ దాడికి ప్రణాళికలు రచిస్తోందని తెలిపింది. ఏకంగా ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ను జైషే మొహమ్మద్ టార్గెట్ చేసిందని, 'సంచలన దాడి' చేయాలని ప్లాన్ వేసిందని వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేక స్క్వాడ్ ను ఏర్పాటు చేసిందని తెలిపింది. దీంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు అజిత్ ధోవల్ భద్రతను సమీక్షించారు.
Narendra Modi
Ajit Doval
ISI
Jaish e Muhammed
Pakistan

More Telugu News