Chiranjeevi: చిరంజీవిని కలిసిన ఉయ్యాలవాడ వంశస్థులు.. స్మృతి వనం ప్రారంభోత్సవానికి ఆహ్వానం

  • జుర్రేరు-కుందు నది కలిసే ప్రదేశంలో స్మృతి వనం
  • రావాలంటూ చిరంజీవికి ఆహ్వానం
  • చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన ఉయ్యాలవాడ వంశస్థులు

తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం మరో వారం రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలంలోని రూపనగుడి గ్రామానికి చెందిన  నరసింహారెడ్డి వంశస్థులు సోమవారం సాయంత్రం చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి అభినందించారు. ‘సైరా’ సినిమా ద్వారా రేనాటి గడ్డ చరిత్రను దశదిశల నిలుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. కోవెలకుంట్లలోని జుర్రేరు, కుందూ నదులు కలిసే ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్న ఉయ్యాలవాడ స్మృతివనం ప్రారంభోత్సవానికి చిరంజీవిని వారు ఆహ్వానించారు. దీనికి చిరంజీవి సానుకూలంగా స్పందించారు.

More Telugu News