venu madhav: హాస్య నటుడు వేణుమాధవ్ పరిస్థితి అత్యంత విషమం

  • మరింత విషమంగా మారిన ఆరోగ్య పరిస్థితి
  • కోమాలోకి వెళ్లారన్న ప్రచారం
  • ఆందోళనకరంగా ఉందంటూ వార్తలు
లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ ఆరోగ్యం మరింత విషమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిన్నటితో పోలిస్తే మరింత క్షీణించిందని ఆయన సన్నిహితుల ద్వారా తెలిసింది. వేణుమాధవ్ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, కోమాలోకి వెళ్లారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 1996లో ‘సంప్రదాయం’ సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి వచ్చిన వేణుమాధవ్ కమెడియన్‌గా తనదైన ముద్ర వేశారు. దాదాపు దశాబ్దంన్నరపాటు హాస్యనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలారు. కొన్ని సినిమాల్లో హీరోగానూ నటించారు.
venu madhav
Tollywood
comedian

More Telugu News