Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి సమంత
  • ప్రభాస్ కి విలన్ గా జగపతిబాబు!
  • మరో ప్రాజక్టుకి విజయశాంతి ఓకే  
*  తన దృష్టిలో ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అంటోంది అందాలతార సమంత. 'ఎన్టీఆర్ అత్యుత్తమ డ్యాన్సర్ అని చెప్పాలి. ఆయనతో డ్యాన్స్ చేయడం అంటే కష్టమే. ఎటువంటి స్టెప్పునైనా ఒకే ఒక్క టేక్ లో వేసేస్తారు. అందుకే, ఆయనతో డ్యాన్స్ చేయాలంటే మాపై చాలా ఒత్తిడి వుంటుంది' అంటూ ప్రశంసలు కురిపించింది.
*  ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న 'జాన్' చిత్రంలో ప్రముఖ నటుడు జగపతిబాబు ఓ కీలకమైన విలన్ పాత్రను పోషించనున్నారు. చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఇటీవల జగపతిబాబును కలసి ఆ పాత్ర గురించి వివరించాడని, ఆయనకు బాగా నచ్చడంతో చేయడానికి వెంటనే ఓకే చెప్పారని సమాచారం.
*  అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్న ప్రముఖ నటి విజయశాంతి.. అనిల్ తదుపరి చిత్రంలో కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. తన 'ఎఫ్ 2' చిత్రానికి సీక్వెల్ చేయడానికి అనిల్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందులో ఓ కీలక పాత్ర గురించి విజయశాంతికి ఆయన వివరించడంతో ఆమె చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు చెబుతున్నారు.
Samantha
NTR
Prabhas
Vijayashanti

More Telugu News