Telangana: ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.. చితక్కొట్టిన భార్య

  • వరంగల్ శివనగర్‌లో ఘటన
  • మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్న భర్త
  • స్థానికులతో కలిసి పట్టుకుని చావబాదిన భార్య
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్తను స్థానికులతో కలిసి చితక్కొట్టి పోలీసులకు అప్పగించిందో భార్య. వరంగల్‌లోని శివనగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. విభేదాల కారణంగా భార్యతో మూడేళ్లుగా దూరంగా ఉంటున్న రవి స్థానికంగా నివసించే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

దీంతో, తన జీవితాన్ని నాశనం చేసి.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు బుద్ధి చెప్పాలని భావించిన ఆమె.. సమయం కోసం వేచి చూసింది. ఈ క్రమంలో నిన్న ఉదయం ప్రియురాలితో అతడు సన్నిహితంగా ఉండడం చూసింది. స్థానికుల సహకారంతో వారిద్దరినీ పట్టుకుని చితకబాదింది. అనంతరం వారిద్దరినీ పోలీసులకు అప్పగించారు.
Telangana
warangal
wife
husband

More Telugu News