Pawan Kalyan: సైరా సెట్లో అమితాబ్ పలకరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది: పవన్ కల్యాణ్

  • అమితాబ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
  • హర్షం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
  • నటనలో ఆయనది ప్రత్యేకమైన ఒరవడి అంటూ కితాబు
నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. అమితాబ్ కీర్తికిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే ఓ కలికితురాయి అని అభివర్ణించారు. నటనలో ఆయన తనకంటూ ఓ ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్నారని, అంతటి గొప్ప వ్యక్తి సైరా సెట్లో ఎంతో నిరాడంబరంగా కనిపించారని పవన్ కొనియాడారు. సైరా సెట్లో ఆయన తనను పలకరించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసిందని, మర్చిపోలేనిదని పేర్కొన్నారు.
Pawan Kalyan
Amitabh Bachchan
Dadasaheb Phalke
Bollywood
Jana Sena

More Telugu News