Venu Madhav: వేణుమాధవ్ పరిస్థితి ఆందోళనకరం... ఆసుపత్రికి వచ్చిన జీవిత, రాజశేఖర్

  • కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వేణుమాధవ్
  • వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు
  • వైద్యులతో మాట్లాడిన జీవిత, రాజశేఖర్
టాలీవుడ్ కమెడియన్ వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు ఆయన ప్రతినిధులు వెల్లడించారు. ఆరోగ్య స్థితి విషమించడంతో వేణుమాధవ్ ను కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చేర్చగా, వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న సినీ నటులు జీవిత, రాజశేఖర్ యశోదా ఆసుపత్రికి వచ్చారు. వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్న వేణుమాధవ్ కు సినిమా అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోయాయి. ఇటీవలే ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Venu Madhav
Jeevitha
Rajasekhar
Tollywood

More Telugu News