Paruchuri: 'అసెంబ్లీ రౌడీ'లో ఛాన్స్ వదులుకున్న జయలలిత: పరుచూరి గోపాలకృష్ణ

  • 'ప్రతిధ్వని' సమయంలో జయలలితను చూశాను 
  • 'ఇంద్రుడు చంద్రుడు'లో బాగా చేసింది 
  • 'అసెంబ్లీ రౌడీ'లో పాకీజా పాత్ర జనంలోకి వెళ్లింది 

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో కేరక్టర్ ఆర్టిస్ట్ జయలలిత గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. చిత్రపరిశ్రమలో మొదటి నుంచి ఒక ఫార్మెట్ నడుస్తోంది. మొదటిసారి లాయర్ పాత్ర చేస్తే లాయర్ పాత్రలకే పిలుస్తుంటారు. డాక్టర్ పాత్ర చేస్తే ఇక డాక్టర్ పాత్రలకే పిలుస్తుంటారు. అలా దురదృష్టవశాత్తు జయలలిత తొలిసారిగా వ్యాంప్ కేరక్టర్ చేసింది.

నేను 'ప్రతిధ్వని' సినిమాకి పనిచేసేటప్పుడు మొదటిసారిగా జయలలితను చూశాను. ఈ అమ్మాయి చాలా బాగుంది .. హీరోయిన్ లక్షణాలు వున్నాయి అనుకున్నాను. ఆ తరువాత 'ఇంద్రుడు చంద్రుడు' సినిమా కోసం నాయుడుగారు కొన్ని ఫోటోలు చూస్తుంటే, ఆ ఫొటోల్లో జయలలితను చూసి నేను గుర్తుపట్టాను. ఆ అమ్మాయిని గురించి నేను నాయుడిగారికి చెప్పడం .. ఆయన ఆ సినిమా కోసం ఆమెను ఎంపిక చేయడం జరిగిపోయింది.

ఆ తరువాత 'అసెంబ్లీ రౌడీ'లో పాకీజా పాత్ర చేయమని ఆమెకి నేను చెప్పాను. కానీ 'గ్యాంగ్ లీడర్'కి డేట్స్ ఇచ్చానని చెప్పి ఆమె 'అసెంబ్లీ రౌడీ'లో పాకీజా పాత్ర చేయలేదు. పాకీజా పాత్ర చేసిన నటికి, ఆ పాత్ర నూరు .. నూటా యాభై చిత్రాల్లో అవకాశాలను తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News