Gaddalakonda Ganesh: 'గద్దలకొండ గణేశ్' చిత్రంపై మహేశ్ బాబు వ్యాఖ్యలు

  • ఆద్యంతం ఎంజాయ్ చేశానన్న సూపర్ స్టార్
  • వరుణ్ తేజ్ నటనకు ఫిదా అయిన మహేశ్  
  • చిత్ర యూనిట్ కు అభినందనలు తెలుపుతూ ట్వీట్
యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రధానపాత్ర పోషించిన చిత్రం గద్దలకొండ గణేశ్. సరిగ్గా విడుదలకు ముందు పేరు మార్చుకున్న ఈ చిత్రం హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పందించారు. గద్దలకొండ గణేశ్ చిత్రంలో వరుణ్ తేజ్ తిరుగులేని నటన కనబర్చాడని కితాబిచ్చారు. మొదటి నుంచి చివరివరకు బాగా ఎంజాయ్ చేశానని ట్విట్టర్ లో తెలిపారు. హరీశ్ శంకర్ దర్శకత్వం అద్భుతంగా ఉందని, 14 రీల్స్ ప్లస్ సంస్థ మంచి చిత్రాన్ని నిర్మించిందని ప్రశంసించారు. ఈ విజయానికి మీరు అన్ని విధాలా అర్హులు అంటూ చిత్ర యూనిట్ కు శుభాభినందనలు తెలిపారు.
Gaddalakonda Ganesh
Mahesh Babu
Varun Tej
Harish Shankar
Tollywood

More Telugu News