Telangana: హుజూర్ నగర్ ఉపఎన్నిక.. ‘కాంగ్రెస్’ అభ్యర్థిగా పద్మావతి రెడ్డి

  • టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ భార్య పద్మావతిరెడ్డి 
  • ఈ మేరకు ప్రకటించిన ‘కాంగ్రెస్’
  • గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమా
తెలంగాణలోని హుజూర్ నగర్ ఉపఎన్నిక త్వరలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డికి అవకాశం దక్కింది. ఈ మేరకు ఆమె పేరును కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి ఆమెను పోటీకి దింపుతున్నట్టు పేర్కొంది.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి ఆమె ఓటమిపాలయ్యారు. హుజూర్ నగర్ లో ఉపఎన్నిక పోరును కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపుపై ఇరుపార్టీల నేతలు ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి, బీజేపీ నుంచి శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు.
Telangana
Huzurunagar
congress
padmavati reddy

More Telugu News