Andhra Pradesh: కోడెల మృతిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

  • ఇటీవల ఓ పిటిషన్ దాఖలు చేసిన బొర్రగడ్డ అనిల్
  • కోడెల మృతితో పిటిషనర్ కు ఎలాంటి సంబంధం లేదు
  • ఈ పిటిషన్ లో ప్రజాప్రయోజనం ఏముంది?
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ దర్యాప్తు కోరుతూ బొర్రగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. కోడెల మృతితో పిటిషనర్ కు ఎలాంటి సంబంధం లేదని, ఇందులో ప్రజాప్రయోజనం ఏముంది? అని పిటిషనర్ ను న్యాయస్థానం ప్రశ్నించింది. కోడెల మృతి ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తు జరుగుతుండగా మధ్యలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
Andhra Pradesh
Kodela
Cbi
High Court

More Telugu News