shane warne: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన షేన్ వార్న్.. డ్రైవింగ్‌పై ఏడాది నిషేధం

  • పరిమితికి మించిన వేగంతో వాహనం నడిపిన ఆసీస్ మాజీ క్రికెటర్
  • నిబంధనలు ఉల్లంఘించడం ఇది ఆరోసారి
  • నిషేధంతోపాటు రూ.1.62 లక్షల జరిమానా
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్‌కు లండన్ కోర్టు షాకిచ్చింది. పరిమితికి మించిన వేగంతో నడిపిన కేసులో సోమవారం లండన్ కోర్టు అతడిపై ఏడాదిపాటు నిషేధం విధించింది. వార్న్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఐదుసార్లు ఉల్లంఘించాడు. ఇది ఆరోసారి. దీనిని తీవ్రంగా పరిగణించిన వింబుల్డన్ మేజిస్ట్రేట్ కోర్టు అతడిపై ఏడాదిపాటు డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధించింది. అంతేకాక.. రూ.1.62 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
shane warne
UK
driving
ban

More Telugu News