భారత్‌లో జరిగే ఎన్‌బీఏ పోటీలకు నేను రావొచ్చు.. జాగ్రత్త: మోదీతో ట్రంప్

  • వచ్చే నెల 4-5 తేదీల్లోముంబైలో ఎన్‌బీఏ పోటీలు
  • తొలిసారి ఆతిథ్యమిస్తున్న భారత్
  • తాను వచ్చే అవకాశం ఉందన్న అమెరికా అధ్యక్షుడు
ఉత్తర అమెరికాకు చెందిన జాతీయ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ నిర్వహించే పోటీల్లో భాగంగా వచ్చే నెల 4,5 తేదీల్లో ముంబైలో సక్రామెంటో కింగ్స్‌ - ఇండియానా పేసర్స్‌ జట్ల మధ్య పోటీలు జరగనున్నాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోటీలను మూడువేల మంది విద్యార్థులు తిలకించనున్నారు.

ఈ పోటీలను వీక్షించేందుకు తాను భారత్ వచ్చే అవకాశం ఉందని, జాగ్రత్త అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారత కాలమానం ప్రకారం గతరాత్రి హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ-మోదీ’ సభకు హాజరైన ట్రంప్ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్‌లో మొట్టమొదటిసారి ఎన్‌బీఏ బాస్కెట్ బాల్ పోటీలు జరగనున్నాయి. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ (మోదీని ఉద్దేశించి) మీరు నన్ను ఆహ్వానిస్తారా? నేను రావొచ్చు.. జాగ్రత్త’’ అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.  
Go Back to Shorts
Narendra Modi
Donald Trump
howdy-modi
NBA games

More Telugu News