Rafele: రాఫెల్ యుద్ధ విమానాలు సూపరట... మరో 36 విమానాల కొనుగోలుకు డీల్!

  • ఇప్పటికే 36 విమానాలు కొన్న ఇండియా
  • అక్టోబర్ 8న తొలి విమానం డెలివరీ
  • తమ విమానాలు తీసుకోవాలని అమెరికా ఒత్తిడి

భారత సైన్యానికి మరిన్ని రాఫెల్ యుద్ధ విమానాలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే కొనుగోలు చేసిన ఫైటర్ జెట్స్ కు అదనంగా మరో 36 విమానాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి, 2020లో డీల్ పై సంతకాలు జరుగుతాయని సమాచారం.

ఇప్పటికే కుదిరిన ఒప్పందంలో భాగంగా 36 విమానాలు ఇండియాకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలి ఫైటర్ జెట్ ను అక్టోబర్ 8న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలి విమానాన్ని అధికారికంగా అందుకోనున్నారు. ఇండియాలో ఉన్న మిగ్ విమానాలు కూలిపోతున్న ఘటనలు పెరుగుతూ ఉండటంతో, అత్యాధునిక యుద్ధ విమానాల కోసం చూస్తున్న వైమానిక దళానికి ఈ రాఫెల్ ఫైటర్ జెట్స్ ఎంతో ఉపయోగపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, ఫ్రాన్స్ అందించే రాఫెల్ బదులు, తాము అందించే ఎఫ్-16 లేదా ఎఫ్-21 విమానాలను కొనుక్కోవాలని అమెరికా సైతం ఇండియాపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News