Narendra Modi: అంతా బాగుందంటూ తెలుగులో మాట్లాడిన మోదీ.. కరతాళ ధ్వనులతో హోరెత్తిన హ్యూస్టన్ సభ

  • హ్యూస్టన్‌లో మోదీకి ఘన స్వాగతం
  • తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని
  • ట్రంప్‌పై పొగడ్తల వర్షం

అమెరికాలోని హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ-మోదీ’ సభలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్రమోదీ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరైన ఈ సభలో మోదీ మాట్లాడుతూ.. అంతా బాగుందని తెలుగులో చెప్పడంతో తెలుగువారు కరతాళ ధ్వనులతో హోరెత్తించారు. తెలుగుతోపాటు మరిన్ని భాషల్లోనూ మాట్లాడిన మోదీ.. హ్యూస్టన్‌లో తనకు అపూర్వ స్వాగతం లభించిందన్నారు.

ఈ సందర్భంగా హ్యూస్టన్ వాసులకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ట్రంప్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. ట్రంప్ పేరు తెలియని వారు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరన్న మోదీ.. ప్రతి పదిమంది సంభాషణల్లోనూ ట్రంప్ పేరు వినిపిస్తుందని అన్నారు. వ్యాపారం నుంచి రాజకీయాల వరకు అన్నింటా ఆయన పేరు వినిపిస్తుందన్నారు.

  • Loading...

More Telugu News