Onion: కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లిధర.. హైదరాబాద్‌లో రూ.50, ఢిల్లీలో రూ.80

  • రెండు వారాలుగా పెరుగుతూ పోతున్న ఉల్లిధరలు
  • నిల్వ ఉన్న ఉల్లిని ఇతర ప్రాంత్రాలకు సరఫరా చేయాల్సిందిగా కోరిన కేంద్రం
  • కనీస ఎగుమతి ధరను పెంచి, ప్రోత్సాహకాలు ఉపసంహరించిన కేంద్రం

ఉల్లి ధరలు మరోమారు బెంబేలెత్తిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న ఉల్లిధర తాజాగా మరింత పెరిగి వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.80 పలుకుతుండగా, హైదరాబాద్‌లో రూ.50గా ఉంది.

ఉల్లిని ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో ముఖ్యంగా మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ఉల్లి రవాణాకు అంతరాయం కలుగుతుండడంతో గత రెండు వారాలుగా ఉల్లి ధరకు రెక్కలు వచ్చాయి. పెరుగుతున్న ధరలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాల్లో నిల్వ ఉన్న ఉల్లిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాల్సిందిగా అన్ని రాష్ట్రాలను ప్రభుత్వం కోరింది. అలాగే, కనీస ఎగుమతి ధరను పెంచి, ప్రోత్సాహకాలు ఉపసంహరించడం ద్వారా ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News