Chandrababu: తమ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని సిగ్గులేకుండా ఎలా చెప్పుకుంటున్నారో చూడండి: చంద్రబాబు విమర్శలు

  • విజయసాయి వీడియోను ట్వీట్ చేసిన చంద్రబాబు
  • ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకే ద్రోహం చేస్తున్నారని మండిపాటు
  • ప్రభుత్వ ఉద్యోగాలు పప్పుబెల్లాల్లా పంచుతున్నారంటూ ఆగ్రహం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారుపై ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నామని సిగ్గులేకుండా ఎలా చెప్పుకుంటున్నారో చూడండి అంటూ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న ఓ వీడియోను ట్వీట్ చేశారు. ప్రజల ఓట్లతో గెలిచి ఆ ప్రజలకే ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత పబ్లిగ్గా తమ అవినీతిని ప్రకటించుకున్న వాళ్లను వదిలేసి, సర్కారు అవినీతిని ప్రశ్నిస్తూ రోడ్డెక్కిన టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. పోలీసులకు జీతాలిస్తోంది ప్రజలా? లేక వైసీపీ పార్టీనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఇది ప్రజాస్వామ్యమా? లేక రాక్షస పాలనా? ప్రభుత్వ ఉద్యోగాలను పప్పు బెల్లాలు పంచినట్టు కార్యకర్తలకు పంచడం ఏంటి అంటూ నిలదీశారు.
Chandrababu
Vijay Sai Reddy
Telugudesam
YSRCP

More Telugu News