Narendra Modi: యూఎస్ తో కుదిరిన కీలక ఒప్పందం... సంతకాలు జరిగాయన్న విదేశాంగ శాఖ!

  • చమురు కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్
  • టెల్లూరియన్, పెట్రో నెట్ ల మధ్య ఎంఓయూ
  • మరికాసేపట్లో సిక్కు ఎన్నారైలతో మోదీ భేటీ

కొద్దిసేపటి క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికాకు చెందిన 16 చమురు కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా, రెండు దేశాల మధ్యా కీలక ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన టెల్లూరియన్, ఇండియాకు చెందిన పెట్రో నెట్ మధ్య అవగాహనా ఒప్పందం కుదరగా, దీని ప్రకారం, ప్రతి సంవత్సరం 5 మిలియన్ టన్నుల సహజవాయువు ఇండియాకు రానుంది.

మొత్తం ఒప్పందం నియమ నిబంధనలు వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి ఖరారు కానున్నాయి. మోదీతో ఆయిల్ సీఈఓల సమావేశం ఫలవంతమైందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. కాగా, మరికాసేపట్లో హ్యూస్టన్ లోని సిక్కు వర్గానికి చెందిన ప్రవాస భారతీయులతో మోదీ సమావేశం కానున్నారు. ఆపై దాదాపు నాలుగు గంటల పాటు సాగే 'హౌడీ మోదీ'లో ఆయన పాల్గొంటారు.

More Telugu News