Prakasam District: రోడ్డుపై రూ. 8 లక్షల బ్యాగు.. చలించని మనుసు.. పోలీసులకు అప్పగింత

  • ప్రకాశం జిల్లాలోని పర్చూరులో ఘటన
  • సాయిబాబా ఆలయం వద్ద దొరికిన బ్యాగు
  • అప్పగించిన యువకుడిని అభినందించిన పోలీసులు
రోడ్డుపై తనకు దొరికిన బ్యాగులో ఉన్న రూ.8 లక్షలు ఉన్నా అతడి మనసు చలించలేదు. దానిని నేరుగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. అతడి నిజాయతీకి మెచ్చిన పోలీసులు అభినందించారు. ప్రకాశం జిల్లా పర్చూరులో జరిగిందీ ఘటన. పర్చూరులోని సాయిబాబా ఆలయం వద్ద ఓ యువకుడికి బ్యాగు దొరికింది. దానిని చూసిన అతడు చేతులోకి తీసుకుని ఆ బ్యాగు సంబంధీకులు ఎవరైనా వస్తారేమోనని చూశాడు. ఎవరూ రాకపోయే సరికి దానిని తెరిచి చూశాడు. అందులో రూ.2 వేల నోట్ల కట్టలు కనిపించాయి. ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది. అయినప్పటికీ అతడి మనసు చలించలేదు.

నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి దానిని పోలీసులకు అప్పగించాడు. అందులోని మొత్తం చూసిన పోలీసులు షాకయ్యారు. అందులో మొత్తం రూ.8 లక్షలు ఉంది. అంత మొత్తాన్ని చూసినప్పటికీ చలించకుండా పోలీసులకు అప్పగించి నిజాయతీని చాటుకున్న యువకుడిని పోలీసులు అభినందించారు. బ్యాగు పోగొట్టుకున్నవారు తగిన ఆధారాలతో వస్తే అప్పగిస్తామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.
Prakasam District
parchuru
bag
Police

More Telugu News