HCA: హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో వివేక్ కు ఎదురుదెబ్బ!

  • వివేక్ నామినేషన్ తిరస్కరణ
  • హైకోర్టులో కేసు ఉందన్న అధికారులు!
  • వివేక్ పై అవినీతి ఆరోపణలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సీ.ఏ) ఎన్నికల్లో మాజీ ఎంపీ జి.వివేక్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్.సీ.ఏ ఎన్నికల్లో వివేక్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయగా, ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. హైదరాబాద్ క్రికెట్ సంఘంలో అవినీతి అక్రమాలపై హైకోర్టులో కేసు ఉన్నందున ఆయన నామినేషన్ చెల్లదని అధికారులు పేర్కొన్నారు. హెచ్ సీఏలో 5 పదవులకు మొత్తం 72 నామినేషన్లు రాగా, 9 మంది వివిధ కారణాలతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈసారి హెచ్ సీఏ ఎన్నికల్లో భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ కూడా ఉన్నారు.
HCA
Vivek
Cricket
Telangana

More Telugu News