India: ‘సర్దార్ పటేల్ జాతీయ సమైక్యత’ అవార్డును తీసుకురానున్న కేంద్ర ప్రభుత్వం!

  • దేశ సమగ్రత, సమైక్యత కోసం కృషిచేసిన వారికి ప్రదానం
  • ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర హోంశాఖ
  • అవార్డు గ్రహీతల పేర్లు గెజిట్ ద్వారా ప్రకటన
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత తొలి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో జాతీయ సమైక్యతా పురస్కారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. జాతి, కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా దేశ సమగ్రత, సమైక్యతకు కృషి చేసినవారికి  ‘సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమైక్యతా పురస్కారం’ను ప్రదానం చేయనున్నారు.

ఈ పురస్కారానికి ఎంపికైనవారి పేర్లను ప్రభుత్వం గెజిట్ ద్వారా ప్రకటించనుంది. గుజరాత్ లోని కేవదియాలో ఇటీవల జరిగిన డీజీపీ, ఐజీ వార్షిక సమావేశంలో పాల్గొన్న మోదీ, సర్దార్ పటేల్ పేరుతో సమైక్యతా పురస్కారాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగానే కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
India
Sardar patel Integration award
Home ministery
Government of india

More Telugu News