Telugudesam: హౌసింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం.. కేశినేని, గద్దె రామ్మోహన్‌లకు అందని ఆహ్వానం

  • హౌసింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన రోజా
  • ప్రొటోకాల్ ప్రకారం టీడీపీ నేతలకు అందని ఆహ్వానం
  • మండిపడుతున్న టీడీపీ నేతలు 
విజయవాడలోని  ఏపీఐఐసీ కాలనీలో హౌసింగ్ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లను ఆహ్వానించకపోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాంప్లెక్స్ నిర్మాణంలో వీరి పాత్ర కీలకమని, అయినప్పటికీ వారిని విస్మరించడం దారుణమని నిప్పులు చెరుగుతున్నారు. ‘ది జవహర్ ఆటోనగర్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కన్స్యూమర్ కో ఆపరేటివ్ స్టోర్స్’ కింద ఏపీఐఐసీ కాలనీలో ఆటోనగర్ కార్మికుల కోసం ప్రభుత్వం నిర్మించిన ఈ కాంప్లెక్స్‌ను ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా ప్రారంభించారు. పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Telugudesam
Kesineni Nani
Gadde Rammohan
APIIC
Roja

More Telugu News