swami chinmayananda: అవును! ఆమెను లైంగికంగా వేధించాను: ఎట్టకేలకు ఒప్పుకున్న బీజేపీ నేత స్వామి చిన్మయానంద

  • లా విద్యార్థిని స్నానం చేస్తుండగా వీడియో
  • బ్లాక్‌మెయిల్ చేస్తూ ఏడాదిపాటు అత్యాచారం
  • తన చర్యలకు సిగ్గుపడుతున్నానన్న చిన్మయానంద
లా విద్యార్థినిపై అత్యాచార ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత స్వామి చిన్మయానంద ఎట్టకేలకు నిజం అంగీకరించినట్టు తెలుస్తోంది. బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు లైంగికంగానూ వేధించానని విచారణ అధికారుల ఎదుట వెల్లడించారు. అప్పటి తన చర్యలకు సిగ్గుపడుతున్నానని, ఇంతకంటే చెప్పేదేమీ లేదని స్పష్టం చేశారు. ఈ కేసులో నిన్న ఉదయం అరెస్ట్ అయిన చిన్మయానందను పోలీసులు తొలుత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆయనను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది.

తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన చిన్మయానంద.. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాది పాటు లైంగికదాడికి  పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదే విషయాన్ని ఆమె కోర్టులో న్యాయమూర్తి ఎదుట చెప్పింది.

తుపాకీతో బెదిరించి తన చేత బలవంతంగా మసాజ్ కూడా చేయించుకున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కోర్టు ఆదేశాల నేపథ్యంలో రంగంలోకి దిగిన యూపీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ను ఏర్పాటు చేశారు. నిన్న ఉదయాన్నే షాజహాన్‌పూర్‌లోని చిన్మయానంద ఆశ్రమానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.  
swami chinmayananda
Uttar Pradesh
lawa student

More Telugu News