Telugudesam: మా తాతయ్య ఆరోగ్యం కుదుటపడుతోంది..వదంతులు నమ్మొద్దు: టీడీపీ నేత శివప్రసాద్ మనవడు

  • తాతయ్య ఆరోగ్యం బాగోకపోతే చెన్నై అపోలోలో చేర్చాం
  • ప్రస్తుతం క్రిటికల్ కేర్ లో ఉన్నారు
  • క్రమంగా కోలుకుంటున్నారు
టీడీపీ సీనియర్ నేత ఎన్.శివప్రసాద్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన మనవడు స్పందించారు. ఈ వదంతులను నమ్మొద్దని కోరారు. తమ తాతయ్య ఆరోగ్యం బాగుండకపోతే వారం రోజుల క్రితం చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులో ఉన్న అపోలో మెయిన్ బ్రాంచ్ లో ఆయనను చేర్చామని చెప్పారు.

ఆయన ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్న సమయంలో మీడియాలో అసత్య వార్తలు వస్తున్నాయని, ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరారు. క్రిటికల్ కేర్ లో వున్నా కోలుకుంటున్నారని చెప్పారు. తమ తాతయ్య ఆరోగ్యం మెరుగుపడాలని, కోలుకోవాలని దేవుడిని ప్రార్థించాలని కోరారు. త్వరలోనే ఆయన కోలుకుని ప్రజల ముందుకు రావాలని ఆశిస్తున్నట్టు ఓ వీడియోలో తెలిపారు.
Telugudesam
N.Sivaprasad
chennai
Apollo

More Telugu News