Kadapa District: కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత శివరామిరెడ్డి భార్య కన్నుమూత

  • వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న కొండమ్మ
  • హైదరాబాద్‌లోని కుమార్తె ఇంట్లో కన్నుమూత
  • కమ్యూనిస్టు ఉద్యమాల్లో భర్తతో కలిసి పాల్గొన్న కొండమ్మ

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కమ్యూనిస్టు యోధురాలు, కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత నర్రెడ్డి శివరామిరెడ్డి భార్య కొండమ్మ గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన కుమార్తె ఇంట్లో తుదిశ్వాస విడిచారు. కమలాపురం మాజీ ఎమ్మెల్యే అయిన శివరామిరెడ్డిని ఆమె 1947లో వివాహం చేసుకున్నారు.  

కమ్యూనిస్టు ఉద్యమాల్లో భర్తకు చేదోడు వాదోడుగా నిలిచిన కొండమ్మ.. జిల్లాలోనే తొలి మహిళా ఉద్యమ నేతగా పేరుగాంచారు. అంతేకాదు, సాయుధ పోరాటానికి తన మెడలోని శేరు బంగారాన్ని విరాళంగా ఇచ్చి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ సహా  పలువురు నేతలు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. కాగా, శివరామిరెడ్డి ఈ ఏడాది జనవరిలో 97 ఏళ్ల వయసులో కన్నుమూశారు.

More Telugu News