TTD: టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా ఏడుగురు

  • ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
  • టీటీడీ సభ్యులతో సమానంగా వర్తించనున్న ప్రొటోకాల్
  • ప్రత్యేక ఆహ్వానితుల్లో వైసీపీ ఎమ్మెల్యే భూమన
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, గోవిందపురి (హైదరాబాద్), రాకేశ్ సిన్హా (ఢిల్లీ), ఏజే శేఖర్ (చెన్నై), కుపేందర్ రెడ్డి (బెంగళూరు), దుశ్మంత్ కుమార్ దాస్ (భువనేశ్వర్)అమోల్ కాలే (ముంబై) లను నియమించారు. కాగా, పాలకమండలి తీర్మానాలను ఆమోదించే సమయంలో వీరికి ఓటు హక్కు ఉండదని, టీటీడీ సభ్యులతో సమానంగా వీరికి ప్రొటోకాల్ వర్తింపజేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
TTD
YSRCP
Mla
Bhumana karunaker reddy

More Telugu News