AAP: ‘ఆప్’ రెబెల్ ఎమ్మెల్యే అల్కా లంబాపై అనర్హత వేటు!

  • ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ప్రకటన
  • అల్కాపై అనర్హత వేటువేయాలని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ పిటిషన్ 
  • ఇటీవలే ‘ఆప్’ సభ్యత్వానికి అల్కా రాజీనామా

ఆమ్ ఆద్మీ పార్టీ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ‘కాంగ్రెస్’ లో చేరిన అల్కా లంబాపై అనర్హత వేటుపడింది. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఆప్ తరపున చాందినీ చౌక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన అల్కా లంబాపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ చేసిన ఫిర్యాదు మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, రెండు వారాల క్రితం ‘ఆప్’ సభ్యత్వానికి అల్కా లంబా రాజీనామా చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

ఆప్ లో చేరడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో అల్కా లాంబా  ఉన్నారు. 2014 డిసెంబర్ లో కాంగ్రెస్ ను వీడి ఆప్ లో చేరారు. తిరిగి మళ్లీ సొంత గూటికే ఆమె చేరారు. ఇదిలా ఉండగా, ఈ అసెంబ్లీ సెషన్ లోనే ఇంతకుముందు ఆప్ మాజీ ఎమ్మెల్యేలు కపిల్ మిశ్రా, సందీప్ కుమార్, అనిల్ బాజ్‌పాయ్, దేవేంద్ర సెహ్రావత్‌లపై అనర్హత వేటు వేశారు.

More Telugu News