Vijayalakshmi: ఎప్పుడూ ఎవరినీ నేను అవకాశాలు అడగలేదు: గాయని విజయలక్ష్మి

  • అప్పట్లో నేను బిజీగా ఉండేదానిని 
  • నాకు కాస్త మొహమాటం ఎక్కువ 
  • ఇప్పుడు అందరి వాయిస్ లు ఒకేలా వుంటున్నాయి    
గాయనిగా విజయలక్ష్మికి మంచి పేరు వుంది. స్టేజ్ సింగర్ గా ఆమె పాప్యులర్ అయ్యారు. కానీ సినిమాల్లో ఆమె ఎక్కువ పాటలను పాడలేకపోయారు. అందుకు గల కారణమేమిటనే విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చారు. "సంగీత దర్శకులు .. కొంతమంది గాయనీ గాయకులు బృందాలుగా ఏర్పడిపోయారు. స్టేజ్ షోలతో బిజీగా ఉండటం వలన నేను ఎవరి బృందంలో వుండలేదు. స్టేజ్ షోలతో నేను ప్రపంచంలోని వివిధ దేశాలకి తిరుగుతూ, ఇక్కడి సంగీత దర్శకులకు అందుబాటులో లేకపోవడం కూడా ఒక కారణం కావొచ్చు.

ఇక నేను ఎప్పుడూ ఎవరినీ అవకాశం ఇవ్వమని అడగలేదు. మొహమాటం కారణంగా నేను ఎప్పుడూ ఎవరినీ కలవలేదు .. కొంతమంది అది పొగరు అనుకుని ఉండొచ్చు. ఇక ఇప్పుడు ఈ పాట ఫలానా సింగర్ తోనే పాడించాలనేం లేదు. ఎవరితోనైనా ఏ పాటనైనా పాడించేస్తున్నారు. అందువల్లనే వాయిస్ ను బట్టి సింగర్ ఎవరో గుర్తుపట్టే పరిస్థితి లేకుండా పోయింది" అని చెప్పుకొచ్చారు.
Vijayalakshmi

More Telugu News