Harish Rao: 14 ఏళ్ల తర్వాత హరీశ్ రావుతో మాట్లాడిన జగ్గారెడ్డి

  • హరీశ్ రావుతో భేటీ అయిన జగ్గారెడ్డి
  • నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరిన జగ్గారెడ్డి
  • తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చిన హరీశ్
దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడారు. ఎప్పుడూ ఉప్పు, నిప్పుగా వ్యవహరించే వీరిద్దరూ ఈ రోజు కలుసుకున్నారు. హరీశ్ తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. దాదాపు అరగంట సేపు వీరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా తన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని హరీశ్ ను జగ్గారెడ్డి కోరారు. జగ్గారెడ్డి వినతికి హరీశ్ సానుకూలంగా స్పందించారు. తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. వీరిద్దరి భేటీ తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.

Harish Rao
Jagga Reddy
TRS
Congress

More Telugu News